మిత్ర – 10

వార్డెన్ దివ్యని మళ్ళీ లోపలకి  తీసుకెళ్ళింది. ఆ రోజుంత  దివ్య అన్యమనస్కంగా పని చేసింది. తరువాత  తన సెల్ కి వెళ్ళింది. ఆమెతో పటు రంగమ్మ లోపలకి వచ్చింది. రంగమ్మ, దివ్య  అదే సెల్ల్లో ఉంటారు. ఏంటమ్మా ఆ ఇన్స్పెక్టర్ అలా  అంటున్నాడు. నేనంతా విన్నాను అసలేమి జరిగిందో చెప్పు. నిన్ను చూస్తుంటే ఎంతో అమాయకురాలు అనిపిస్తున్నావు నువ్వీ అఘాయిత్యం చేసావంటే నమ్మబుద్ధికావటం లేదు అంది. దివ్య ఆమెని చూసి జీవం   లేని నవ్వు నవ్వి  పడుకుంది.
ఆ రోజు తను తెల్లని చుడిదార్ వేసుకుని తలంటు స్నానం చేసింది. బయటకి రాగానే అక్కడ మల్లె  చెట్టు ఉంది. కొన్ని పూలు కోసి గబా గబా దండ కట్టి తలలో పెట్టుకుంది. అద్దంలో చూసుకుంటే అప్సరసలా ఉన్న తనను చూసుకుని తనలో తనే నవ్వుకుంది. ఇంతలో బయట అందరు తనని పిలుస్తున్నారు. వెళ్ళింది అబ్బాయిలందరూ తనను ఆరాధనగా చూస్తున్నారు. అఖిల్ వైపు చూసింది కళ్ళార్పకుండా తననే చూస్తున్నాడు. తను కొంచెం సిగ్గుపడి తల వంచుకుని వాళ్ళదగ్గరకి వెళ్ళింది. ఇంతలో సుహాసిని వచ్చింది కదా ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గో గయ్స్ అని అఖిల్ చేయిపట్టుకుని పక్కకి లాక్కెళ్ళింది. తను బాధగా అనిపించినా మళ్ళీ అంతలోనే సర్దుకుని వాళ్ళతో నడవటం ప్రారంబించింది. సుదీర్ తన పక్కకి వచ్చి యు అర్ స్టన్నింగ్ బ్యూటి . మీరు చాల అందంగా ఉన్నారు అన్నాడు. తాను థాంక్స్ అని నడుస్తుంది. అఖిల్ అప్పడప్పుడు తన వైపు ఆరాధనగా చూస్తున్నాడు. తనకి చాల గర్వంగా అనిపిస్తుంది. ఇంతలో అమ్మా అని కేక వినిపించింది అందరు ఉలిక్కిపడ్డారు చూస్తే సుహాసిని తను కాళ్ళు  పట్టుకుని కింద కూర్చుని ఏడుస్తుంది ఏదో కుట్టింది నన్ను అంటూ చూస్తే దూరంగా పాము వెళ్ళటం చూసారు అందరు అంతే సుహాసిని కళ్ళు తిరిగిపడిపోయింది. వెంటనే అఖిల్ తన కాలికి గట్టిగా  గుడ్డ కట్టి  తనని ఎత్తుకుని గెస్ట్ హౌస్ తీసుకువెళ్ళాడు అక్కడకి వెళ్ళిన తరువాత అందరు చాల కంగారుగా ఉన్నారు. వాచ్ మాన్ డాక్టర్ ని తీసుకొచ్చాడు. డాక్టర్ వచ్చి విరుగుడు ఇంజక్షన్ చేసి టాబ్లెట్స్ ఇచ్చి వెళ్లారు అందరు వాళ్ళ రూం లోకి వెళ్లి పడుకున్నారు. తను బయటకి వెళ్లి లాన్ లో కూర్చుంది. అఖిల్ కూడా వచ్చి పక్కన కూర్చున్నాడు. తనని చూసి నవ్వి థాంక్స్ అంది ఎందుకు అన్నాడు. నీ వల్లే తను బ్రతికింది అంది. నేనేమి చేశాను జస్ట్ మోసుకొచ్చాను అన్నాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళెవరు కనీసం రియాక్ట్ కాలేదు. అతను చిన్న స్మైల్ ఇచ్చి నువ్వు చాల అందంగా ఉన్నావు నీ నుంచి చూపు తిప్పుకోలేకపోతున్నాను అన్నాడు. ఆమె సిగ్గుపడింది. దీని గురించి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పకు కంగారు పడతారు అన్నాడు. తను చెప్పటానికి నాకెవరు లేరు అంది. అదేంటి మీ అమ్మ వాళ్ళు? చనిపోయారు నేను చిన్నప్పుడే చనిపోయారు అంది. అతను సారీ అన్నాడు. ఆమె నవ్వి ఎందుకు అంది. మీ అమ్మ వాళ్ళని గుర్తు చేసి బాధపెట్టాను కదా అందుకు అన్నాడు దానికి ఆమె నేను మర్చిపోతేగా అంది. కాసేపు ఏమి మాట్లాడకుండా అలానే ఉండిపోయారు ఇద్దరు. బొంచేసావ అన్నాడు అఖిల్ కాసేపటికి లేదు అంది వెళ్లి తిందాము రండి.నాకు ఆకలిగా లేదు అంది. అయ్యో వీడు బిసేబెల బాత్ చేసాడు సూపర్ గా  ఉంది మిస్ అయిపోతారు. తను ఏమి మాట్లాడకపోయేసరికి మనం రేపు పొద్దునే వెళ్ళిపోతున్నాము అన్నాడు. తను అలాగా సరే కొంచెం సేపు నన్ను ఒంటరిగా వదిలెయ్యండి ప్లీజ్ అంది. అతను సరే అని అతను వెళ్ళిపోయాడు.
తనకి వాళ్ళ నాన్న గుర్తొచ్చాడు
ఒక ఆడది తన భర్తకి రాణి కాకపోవచ్చేమో కానీ తన తండ్రికి ఎప్పుడు యువరాణే. అది తన విషయంలో చాల కరెక్ట్. లేక లేక కలిగిన ఆడపిల్లని అని తన అన్నయ్యతో సహా అందరు తనని ఎంతో ముద్దుగా చూసుకునే వాళ్ళు. నాన్న తను ఏది అడిగితే అది కొనిచ్చేవాడు. ఒక రోజు స్కూల్ లో ఉండగా అన్నయ్య తనని స్కూల్  బెల్ కొట్టకముందే ఇంటికి  తీసుకుని వెళ్ళాడు. అక్కడ తన ఇంటి ముందు అందరు గుంపుగా ఉన్నారు నాన్నని అక్కడ పడుకోబెట్టారు. తనకి అర్థం అయ్యింది తనను ఎంతో  ప్రేమించే నాన్న ఇక తనకు లేరు అని. ఆ రోజు అందరు ఏడుస్తుంటే తనకి ఏదోలా ఉంది. కోపం దేవుడి మీద తన తండ్రి తన నుంచి దూరం చేసాడనే కోపం ఉక్రోషం తో వంట గదిలోకి వెళ్లి కిరోసిన్ డబ్బా తీసుకుని దేవుడి గదిలోకి వెళ్లి కిరోసిన్ మొత్తం పోసి అగ్గి పెట్టి గిసి పడేసింది భగ్గున అంటుకుంది ఇల్లు అందరు ఉలిక్కిపడి బయటకి పరిగెత్తి మంటలు ఆర్పారు. ఆ పది రోజులు అందరు ఉండి చేయవలిసిన తతంగం అంత అన్నయ్య చేత చేయించి అన్నయ్యని ఒక మావయ్య దగ్గరకి తనని ఇంకో మావయ్య దగ్గరకి పంపారు.
అలా కొంతసేపు అక్కడే కూర్చుంది. వాచ్ మాన్ వచ్చి ఎంటమ్మ ఇక్కడ కూర్చున్నావు భయమేసిందా ఇక్కడ ఇవన్ని మామూలే తల్లి పో లోపలకి పోయి పడుకో చీకటి పడ్డాక పురుగు పుట్ర వస్తుంటాయి అన్నాడు. ఆమె అలాగే తాత అని లోపలకి వెళ్లి సుహాసిని పక్క కూర్చుంది. అలికిడికి సుహాసిని కళ్ళు తెరవగానే ఎలా ఉంది అని అడిగింది. పర్లేదు అన్నట్టు తల ఊపి కళ్ళు మూసుకుంది. తను తన మంచం మీద పడుకుని కళ్ళు మూసుకుంది. అఖిల్ గుర్తొచ్చాడు తను చూసిన చూపే గుర్తొస్తుంది.అలా ఎప్పుడు నిద్రపోయిందో తెలియదు. తెల్లవారు జామున అలికిడికి లేచింది అందరు రెడీ అయిపోయారు. తను లేచి స్నానం చేసి వచ్చేసరికి అన్ని కారులో సర్దేసారు. కార్ వెనక సీట్లో సుహాసిని పడుకుంది తను ముందు సీట్ లో కూర్చుంది. అఖిల్ డ్రైవ్ చేస్తున్నాడు. తను అల అతని పక్కన కూర్చోవటం  చాల బాగుంది. కాసేపు ఎవరు ఏమి మాట్లాడలేదు. కాసేపటకి అఖిల్ ఏంటి రాత్రి చాల సేపు బయటే కూర్చున్నట్టున్నావు అన్నాడు. తను నవ్వి నాకు అలా ఒంటరిగా ఇష్టం అంది. ఒంటిరిగా కూర్చుని ఏమి చేస్తుంటారు అన్నాడు. తను నవ్వి చుక్కలు లెక్కపెడతాను అంది. ఆహ అయితే ఎంత లెక్క అన్నాడు. ఏంటి అంది. అదే చుక్కలు  లెక్కపెడతాను అన్నారు కదా నిన్నటి లెక్క ఎంత అని అడుగుతున్నాను అన్నాడు. తను నవ్వింది ఆమె నవ్వుతో అతను నవ్వు కలిపాడు. మీరు నవ్వితే చాల బాగుంటారు అంది. అతను వావ్ ఎన్నాళ్టికి నన్ను పొగిడావు థాంక్స్ థాంక్స్ అన్నాడు. అయినా నాకు బాధగా ఉంది అన్నాడు. ఎందుకు అంది. నేను చూడండి మీరు పరిచయం అవ్వగానే మీరు నుంచి నువ్వు లోకి వచ్చాను కానీ నువ్వు ఇంకా మీరు అనే అంటున్నావు అన్నాడు. తను సారీ ఇక నుంచి నువ్వు అనే పిలుస్తా సరేనా అన్నాడు. అతను థాంక్స్ అన్నాడు. మీకు అన్నయ్య కానీ చెల్లి ఉన్నారా అన్నాడు. ఉన్నాడు ఒక అన్నయ్య ఉన్నాడు అంది. ఎక్కడ ఉంటారు ఏమి చేస్తుంటారు అన్నాడు.  ఏమో తెలియదు అంది. అతను ఆశ్చర్యంగా అదేంటి అన్నాడు. చిన్నప్పుడు మా నాన్నగారు చనిపోయాక తను మా పెద్ద మావయ్య దగ్గర కి వెళ్ళాడు నన్ను మా చిన్న మావయ్య దగ్గరకి పంపారు అప్పట్నుంచి మా అన్నయ్య గురించి ఏమి తెలియదు నాకు అంది. అతను ఆశ్చర్యంగా అలాగా అన్నాడు . మీ అన్నయ్య పేరు ఏంటి అన్నాడు. తన పేరు కళ్యాణ్ అంది. అతను మా ఫ్రెండ్ పేరు కూడా  కళ్యాణే అన్నాడు. ఆమె ఓహ్ అలాగా అంది. ఆమె నాకు కొంచెం నిద్రొస్తుంది నేను పడుకుంటాను అంది. అతను సరే అని విండోస్ క్లోజ్ చేసి AC ఆన్ చేసాడు. తను సీట్ ని వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది. కొంత దూరం వెళ్ళాక ఆమె వైపు చూసాడు. అందమైన ముఖం ac గాలికి ఆమె ముంగురులు ముందుకు పడ్డాయి. గుండ్రటి కళ్ళు, ఒద్దికైన ముక్కు. చిన్ని పెదాలు అవి ఏదో అందమైన కల కంటున్నట్టు చిన్నగా విచ్చుకుని నవ్వుతున్నట్టుగా ఉంది. అతను తనని చూసి నవ్వుకుని తన సెల్ ఫోన్ తీసుకుని తనని  ఫోటో తీసాడు. సేవ్ చేసి ఫోటోని ముద్దు పెట్టుకుని ఫోన్ ని పక్కన పెట్టేసాడు. అప్పటివరకు అతను చేసిన  పనులన్నిటిని కోపంతో  చూసిన సుహాసిని మెల్లగా మరో వైపు తిరిగి కళ్ళుమూసుకుంది. వాళ్ళని హాస్టల్ దగ్గర దింపి తను ఇంటికి వెళ్ళిపోయాడు.

ఆ రోజునుంచి దివ్య అతనితో బాగా మాట్లాడుతుంది. ఇద్దరు కలిసి తినటం, కాఫీకి, అప్పుడప్పుడు అందరితో కలిసి సినిమాకి  వెళ్ళటం మామూలు అయిపొయింది. ఒక రోజు వాళ్ళ మేనేజర్ అఖిల్ ని పిలిచాడు. పది నిమిషాలైన రాకపోయేసరికి మేనేజర్ కేబిన్ వైపు చూసింది. అఖిల్ ముఖం కనిపించటం లేదు కానీ అతను చెప్తున్నది మేనేజర్ ఒప్పుకోవటంలేదు. కాసేపు అయిన తరువాత వచ్చి కాఫీకి వెళ్దాము వస్తావా అన్నాడు దివ్యతో. తను సరే అని వెళ్ళింది. అతను 5 నిమిషాలు ఏమి మాట్లాడలేదు. తరువాత నెమ్మదిగా నన్ను ప్రాజెక్ట్ మార్చారు దివ్య అన్నాడు. అతను చెప్తున్నది ఆమెకి అర్థం కాలేదు. ఏంటి అంది. నన్ను మన ప్రాజెక్ట్ నుంచి వేరే ప్రాజెక్ట్ కి మార్చారు అన్నాడు. అతను దిగులుగా ఉండటం చూసి అయితే ఏమి అయ్యింది  జాబు పోలేదుగా అంది. ఇంతకి ఏ ప్రాజెక్ట్ అంది. అతను చెప్పాడు అది ఇక్కడ లేదు కదా వైట్ ఫీల్డ్ ఆఫీసు లో ఉంది కదా అంది/. అతను అవును అన్నాడు. ఎప్పుడు రిలీజ్ అంది. అతను రేపే అన్నాడు. ఆమె నవ్వి కంగ్రాట్స్ అంది. అతను కోపంగా వెటకారమా అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా లేదే అంది. అతను ఇంకా సీరియస్ గ ఉండటం చూసి ఏమి అయ్యింది అంది. నీకు వెళ్ళటం ఇష్టం లేకపోతే చెప్పొచ్చుగా అంది. చెప్పాను వినటం లేదు అన్నాడు. అయితే వేళ్లోచ్చుగా అంది. అతను నిన్ను వదిలి వెళ్ళటం నాకిష్టం లేదు అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది అతని వైపు. అతను నేను నిన్ను ప్రేమిస్తున్నాను దివ్య. ఇప్పుడే కాదు మొదటిసారి నిన్ను చూడగానే నేను లవ్లో పడ్డాను. నువ్వు లేకపోతే నేను లేను అని ఆమె ముఖం లో చూసాడు. ఆమె విసురుగా అక్కడనుంచి వెళ్ళిపోయింది. అతను అలానే బాధగా ఆమె వెళ్ళిన వైపే చూస్తూ కూర్చున్నాడు.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s